బీమా డబ్బులను వెంటనే విడుదల చేయాలి

ABN , First Publish Date - 2020-12-31T04:27:47+05:30 IST

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో గల సోయా పంట, పత్తి పంటలు నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా ప్రీమియం డబ్బులను వెంటనే విడుదల చేయాలని డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం బేల మండల కేంద్రంలో రైతుల పక్షాన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

బీమా డబ్బులను వెంటనే విడుదల చేయాలి
బేలలో రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, రైతులు

జైనథ్‌, డిసెంబరు 30: ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో గల సోయా పంట, పత్తి పంటలు నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా ప్రీమియం డబ్బులను వెంటనే విడుదల చేయాలని డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం బేల మండల కేంద్రంలో రైతుల పక్షాన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేని కారణంగా రైతులు నష్ట పోయారన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకో వాలని లేనిపక్షంలో రైతులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి గండ్రత్‌ సుజాత, బేల మండల పార్టీ అధ్యక్షుడు ఫైజుల్లాఖాన్‌, ఐఎన్‌టీసీ జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T04:27:47+05:30 IST