ఆసుపత్రిని త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-06-16T10:48:41+05:30 IST
బెల్లంపల్లిలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని త్వర గా పూర్తి చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాంట్రాక్టర్‌కు సూచించారు. సోమవారం ఆసుపత్రి

బెల్లంపల్లి, జూన్ 15 : బెల్లంపల్లిలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని త్వర గా పూర్తి చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాంట్రాక్టర్‌కు సూచించారు. సోమవారం ఆసుపత్రి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. పనులను ఆలస్యం చేయకుండా నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రజలు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే వెంట ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ డీఈఈ నరసింహారావు, ఏఈఈ మోబిన్, ఏఈ రమేష్ పాల్గొన్నారు.