ప్రభుత్వం తలపెట్టిన నిర్మాణాలను వారంలోగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-30T06:25:58+05:30 IST

జిల్లాలో పల్లెప్రగతిలో భాగంగా చేపడు తున్న డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్‌, శ్మశాన వాటికల నిర్మాణాల పనులను వారం లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం తలపెట్టిన నిర్మాణాలను వారంలోగా పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌

అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

నిర్మల్‌ టౌన్‌, డిసెంబరు 29 : జిల్లాలో పల్లెప్రగతిలో భాగంగా చేపడు తున్న డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్‌, శ్మశాన వాటికల నిర్మాణాల పనులను వారం లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శ్మశానవాటిక ల నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రామాల వారీగా నిర్మాణ పనుల పురోగతిని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ పల్లె ప్రగతిలో చేపడుతున్న డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్‌, శ్మశాన వాటికల నిర్మాణాల పనులను వేగవంతం చేసి వెంటనే  పూర్తి చేయాలని ఆదేశించా రు. సంబంధిత శాఖల అధికారులు పురోగతిని ప్రతీరోజు పర్యవేక్షించాలని సూచించారు. శ్మశాన వాటికల ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. అధికారులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసి నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, జనవరి మొదటి వారంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించాలని తెలిపారు. కడెం, ఖానాపూర్‌, కుబీర్‌, లక్ష్మణచాంద, మామడ, ముథోల్‌, పెంబి, సారంగా పూర్‌లలో మొత్తం శ్మశాన వాటిక నిర్మాణ పనులు 213 కాగా అందులో 162 పూర్తి, మిగతా 51 ప్రోగ్రెస్‌లో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావ్‌, పంచాయతీరాజ్‌ శాఖ డీఈ తుకారాం, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఏఈవోలు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T06:25:58+05:30 IST