ప్రభుత్వ యంత్రాంగానికి తోడ్పాటునందించాలి

ABN , First Publish Date - 2020-12-19T06:37:50+05:30 IST

ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజల తోడ్పాటు అవసరమని అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణి అన్నారు. జిల్లాలో నో హెల్మెట్‌ నో పెట్రోల్‌ అమలు పరిచే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోలీసు, రవాణా, పెట్రోల్‌ బంక్‌ డీలర్లతో సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ యంత్రాంగానికి తోడ్పాటునందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 18: ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజల తోడ్పాటు అవసరమని అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణి అన్నారు. జిల్లాలో నో హెల్మెట్‌ నో పెట్రోల్‌ అమలు పరిచే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోలీసు, రవాణా, పెట్రోల్‌ బంక్‌ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ హెల్మెట్‌ వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. హెల్మెట్‌ వినియోగం ప్రజల్లో మనస్ఫూర్తిగా వచ్చే విధంగా అమలు పరిచే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కొనసాగించినట్లయితే ప్రజలకు అవగాహన కలుగుతుందని, ట్రాఫిక్‌ జంక్షన్‌లు, జన సముహాలు, ముఖ్య కూడళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో హెల్మెట్‌ వాడకంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వచ్చే జనవరి 1 నుంచి హెల్మెట్‌ వినియోగించని వారి నుంచి జరిమానాలు వసూలు చేయాలని సూచించారు. గత 2016 సంవత్సరంలో హెల్మెట్‌ వినియోగం పై జిల్లాలో విస్త్రృత ప్రచారం నిర్వహించడం జరిగి సత్ఫాలితాలు సాధించా మని, ప్రభుత్వ ఉద్యోగులు తప్పని సరిగా హెల్మెట్‌ వినియోగించడం ద్వారా ప్రజల్లో చై తన్యం తీసుకు రావచ్చాన్నారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ హెల్మెట్‌ వినియోగంపై విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, పోలీసు, రవాణా, ఇతర ప్రభుత్వ శాఖలు, డీలర్ల సహాకారంతో హెల్మెట్‌ వినియోగంపై ప్రజలకు వివరించవచ్చన్నారు. ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రోజుకు ప్రమా దాల వలన 450 మరణాలు జరుగుతున్నాయని, అందులో 250 మరణాలు మోటర్‌ సైకిల్‌ ప్రమాదాలే అని తెలిపారు. హెల్మెట్‌ వినియోగించడం ద్వారా ప్రాణాలతో పాటు కుటుంబాలకు భరోసా కల్పించవచ్చని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహన చోదకులు తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలని, నిర్లక్ష్యం వహించిన వారి పై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. హెల్మెట్‌ ఉన్న వారికి పెట్రోల్‌ పోయాలని, 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు పెట్రోల్‌ పోయకూడదని సూచించారు. ఐఎస్‌ఐ మార్క్‌ కలిగిన హెల్మెట్‌లని వాహన చోదకులు వినియోగించాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో పోలీసు యంత్రాంగం సహకరిస్తుందని తెలిపారు. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయడానికి సహకరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారి సుదర్శనమ్‌, మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ సీఐ గంగాధర్‌, పోలీసు, రవాణా, పెట్రోల్‌ బంకుల డీలర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-19T06:37:50+05:30 IST