రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2020-03-08T12:20:09+05:30 IST

రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ రైతులనుఆదుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కిసాన్‌సెల్‌ అధ్య

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి7: రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ రైతులనుఆదుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కిసాన్‌సెల్‌ అధ్య క్షుడు అన్వేష్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో కంది, పత్తి రైతులకు మద్ధతు ధరతో పాటు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అన్యాయానికి గాను శనివారం ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డుకు వచ్చి కంది కొనుగోళ్లను పరిశీలించారు. వ్యవసాయ అధికారులు రైతుల వివ రాల నమోదు, రైతులకు చెల్లిస్తున్న క్వింటాల్‌ మద్ధతు ధర, మార్కెట్‌లో అసౌకర్యాల పై రైతులను అడిగి తె లుసుకున్నారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ అక్ర మాలకు తావులేకుండా కందులను కొనుగోలు చేసి ప్ర భుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. కాని రాష్ట్ర స్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగడం లేదన్నారు. కందుల కొనుగోళ్లలో రైతులకు అన్ని అవస్థలే ఏర్పడుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన కందులకు డబ్బులు చెల్లించక పోవడంతో పంటను విక్రయించినప్పటికీ అన్నదాత అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింద న్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయ కులు, ప్రజా ప్రతినిధులు గొప్ప గొప్పమాటలు చెబు తున్న రైతుల పంటలను కొనుగోలు చేస్తున్న తరుణం లో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. త్వరలో శనగపంటను కొనుగోలు చేసేం దుకు చర్యలు తీసుకోవాల్సి వ స్తున్న ఇప్పటి వరకు పత్తి, కంది పంటను విక్ర యించిన రైతు లకు డబ్బులు రాక పోవడం బాధకరమన్నారు.


ఇలాంటి పరిస్థితి ఇకనైనా మం త్రులు, ఎమ్మె ల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించా రు. ఇప్పటి వరకు పత్తి, కందిని విక్రయించిన రైతులకు ప్రభుత్వం ద్వారా వారి ఖాతాల్లో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సీసీఐ, మార్క్‌ఫెడ్‌ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. ముఖ్యంగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి వారు అప్పుల పాలుకాకుండా ప్రభుత్వం నుంచి డబ్బులు అందేలా చూడాలని కోరారు. 


లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందులో కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌, జడ్పీటీసీ గోకగణేష్‌రెడ్డి, నాయకులు నర్సన్న, విజయ్‌, రాహుల్‌ తదితర నాయకులున్నారు. 

Updated Date - 2020-03-08T12:20:09+05:30 IST