రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2020-12-30T06:27:39+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతు లను రాజు చేయాలనే ఉద్దేశ్యంతో వారి అభ్యున్న తికి పెద్దపీట వేస్తుందని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి అన్నారు.

రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

రైతువేదిక ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి 

ఇందిరా జలప్రభ లబ్ధిదారులకు రూ. 26లక్షలతో పంపు సెట్ల పంపిణీ

కుభీర్‌, డిసెంబరు 29 :  రాష్ట్ర ప్రభుత్వం రైతు లను రాజు చేయాలనే ఉద్దేశ్యంతో వారి అభ్యున్న తికి పెద్దపీట వేస్తుందని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి అన్నారు. ఇటీవలే మండలంలోని డొడర్న సాయినగర్‌ తాండాలో నూతనంగా నిర్మించిన రైతువేదికను మంగళవారం ఎమ్మెల్యే శిలా ఫల కాన్ని ఆవిష్కరించి,  ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  రైతులను రాజు చేయాలనే ఉద్దే శ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా, సబ్సిడీ విత్త నాల పంపిణీ, రైతులకు సకాలంలో ఎరువుల పంపిణీతో పాటు రైతుబీమా, రైతుబంధు, తదితర పథకాలను ప్రవేశ పెట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. గత ప్రభుత్వం ఇందిరా జల ప్రభ కింద లబ్ధిదారులను ఎంపిక చేసి వారి చేన్లలో, వ్యవసాయ పొలాల్లో బోర్లను తవ్వించి, మోటరు పంపులను సరఫరా చేయలేదు. దీంతో మండల రైతులు ఎమ్మెల్యే దృష్టికి తేగా ఆయన కృషి చేసి మండలంలోని 25 మంది లబ్ధిదారులకు గాను రూ. 26 లక్షలతో పంపుసెట్టును పంపిణీ చేశారు. అనంతరం డీఆర్‌ డీవో వెంకటేశ్వరులు మాట్లాడుతూ అర్హులైన లబ్ధి దారులకు గిరివికాస్‌ కోసం దరఖాస్తు చేసు కోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధి దారులకు పథకం వర్తించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మండలంలో నెల కొని ఉన్న సమస్యలు, చేపడుతున్న పనులను టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి తూం రాజేశ్వర్‌ ఎమ్మె ల్యేకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ టీసీ అల్కతాయి సంజయ్‌, వైస్‌ ఎంపీప మోహియోద్దీన్‌, స్థానిక సర్పంచ్‌ షేక్‌షానూర్‌బీ, పీఏ సీఎస్‌ చైర్మన్‌, మార్క్‌ఫెడ్‌ స్టేట్‌ డైరెక్టర్‌ గంగా చరణ్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పుప్పాల పీరాజీ, నాయకులు తూం రాజేశ్వర్‌, చౌహన్‌ శంకర్‌, సాయెబ్‌రావు, సంజ య్‌చౌహన్‌, తహసీల్దార్‌ ప్రభాకర్‌, ఎంపీడీవో శేఖర్‌, ఏవో వికార్‌హైమ్మద్‌, పీఆర్‌జేసీ రాజేం దర్‌రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీ టీసీలు, తదితులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T06:27:39+05:30 IST