సమసమాజ నిర్మాణమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-08-01T11:02:09+05:30 IST

సమసమాజ నిర్మాణమే సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ పార్టీ లక్ష్యమని జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాస్‌, డివిజన్‌ కార్యదర్శి లాల్‌కు

సమసమాజ నిర్మాణమే లక్ష్యం

సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ 


మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 31: సమసమాజ నిర్మాణమే సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ పార్టీ లక్ష్యమని జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాస్‌, డివిజన్‌ కార్యదర్శి లాల్‌కు మార్‌, సహాయ కార్యదర్శి తోకల తిరుపతి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్క్స్‌భవన్‌లో న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకులు పూనెం లింగన్న చిత్ర ప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం గుండాల అడవుల్లో లింగన్నను బూటకపు ఎన్‌కౌంటర్‌ చేసిందని, 1967 నుంచి నక్సల్‌బరి, శ్రీకాకుళం, గోదావరిలోయ ప్రతిఘటన పోరాటంలో ఆయన పా ల్గొని పేదప్రజల పక్షాన నిలబడ్డారన్నారు.  అసమానతలను మార్చాలంటే సామూ హిక తిరుగుబాటు తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నారు. విప్లవ ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం యూపీఏ, ఎన్‌ఐఏ తదితర చట్టాలను తీసుకొచ్చి నాయ కులను నిర్బంధించడం మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏఐకేఎంఎస్‌ నాయకులు దొండ ప్రభాకర్‌, ఇఫ్టూ నాయకులు బ్రహ్మానందం, మల్లన్న, పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి  మంగ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-01T11:02:09+05:30 IST