ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రజలపై భారం
ABN , First Publish Date - 2020-10-07T06:09:40+05:30 IST
ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై అధిక భారం మోపుతోందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ

పీసీసీ అధికార ప్రతినిధి సత్యనారాయణ
మంచిర్యాల, అక్టోబరు 6: ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై అధిక భారం మోపుతోందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ ఆరోపించారు. జిల్లా కేంధ్రంలోని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లే అవుట్ అనుమతులు ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్‌లకు ముందే చెప్పి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడ్డ వారు మాత్రమే స్పందించే వారని చెప్పారు. ప్రభుత్వ వైఖరి వల్ల ప్రజలందరిపై భారం మోపినట్లయిందన్నారు. మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ మాట్లాడుతూ సొంత ట్రస్టుతో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావును విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే దివాకర్‌రావు తనయుడు విజిత్‌కుమార్‌కు లేదన్నారు. నియోజక వర్గంలోని మహిళలకు ప్రేంసాగర్‌రావు 80వేల చీరలు పంపిణీ చేస్తే బూటకమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఏ మండలంలో ఎన్ని చీరలు పంచుతున్నారో గణాంకాలతో సహా ఆయన వివరించారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు అంకం నరేష్, మైనార్టి విభాగం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్, నాయకులు మారుతి, వొడ్నాల శ్యాంసుంధర్, బొల్లం భీమయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.