నీలివిప్లవం సాధించాలి

ABN , First Publish Date - 2020-09-16T06:04:01+05:30 IST

జలకళతో ఉట్టిపడుతున్న చెరువుల్లో ప్రభుత్వ సహ కారంతో చేపల పెంపకం చేపట్టి నీలివిప్లవాన్ని సాధించాలని ఎంపీపీ సంతోషం రమాప్రతాప్‌రెడ్డి

నీలివిప్లవం సాధించాలి

నెన్నెల , సెప్టెంబరు 15: జలకళతో ఉట్టిపడుతున్న చెరువుల్లో ప్రభుత్వ సహ కారంతో చేపల పెంపకం చేపట్టి నీలివిప్లవాన్ని సాధించాలని ఎంపీపీ సంతోషం రమాప్రతాప్‌రెడ్డి అన్నారు. కుమ్మరివాగు ప్రాజెక్టులో మంగళవారం 6 లక్షల చేప పిల్లలను వదిలారు. గంగపుత్రులు, మత్స్య సంపదపై ఆధారపడి జీవించే బడు గుల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు.  ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఇబ్రాహీం, శ్రీనివాస్‌గౌడ్‌, తోకల తిరుపతి, తోట శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-16T06:04:01+05:30 IST