జాతర లోపు ఆలయ నిర్మాణం పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-11-27T04:09:16+05:30 IST
మండల కేంద్రంలోని నాగోబా ఆలయ నిర్మాణం జాతర లోపు పూర్తి చేయాలని మాజీ ఎంపీ గోడాం నగేష్ అన్నారు. గురువారం మెస్రం వంశీయులతో పాటు ఆలయ ఆవరణలో రూ.5 కోట్లతో ఇతర అభివృద్ధి పనులు చేసే సంబందిత కాంట్రాక్టకు సూచించారు.
ఇంద్రవెల్లి, నవంబరు 26: మండల కేంద్రంలోని నాగోబా ఆలయ నిర్మాణం జాతర లోపు పూర్తి చేయాలని మాజీ ఎంపీ గోడాం నగేష్ అన్నారు. గురువారం మెస్రం వంశీయులతో పాటు ఆలయ ఆవరణలో రూ.5 కోట్లతో ఇతర అభివృద్ధి పనులు చేసే సంబందిత కాంట్రాక్టకు సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు కోట్ల రూపాయలతో నాగోబా ఆవరణంలో చేపట్టే అభివృద్ది పనులతో పాటు నిర్మించే రాజగోపురం, ధ్వజస్తంభం, మండపం, మినీస్టేడియం నిర్మాణాలపై సంబంధిత కాంట్రాక్టర్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు వెంకట్‌రావు పటేల్, సోనేరావు, తుకారాం, లింబారావు, బాదిరావు, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.