తెలంగాణ విముక్తి దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-09-14T10:28:16+05:30 IST

తెలంగాణ విముక్తి దినాన్ని ప్రభుత్వమే అధికా రికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ విముక్తి దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్‌


శ్రీరాంపూర్‌, సెప్టెంబరు 13: తెలంగాణ విముక్తి దినాన్ని ప్రభుత్వమే అధికా రికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్‌ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌ ఏరియాలో జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివంగత తాళ్ళపల్లి కొమురయ్య స్థూపం వద్ద ఏఐటీయూసీ కార్యదర్శి కొట్టె కిషన్‌రావు, హిమ్మత్‌నగర్‌ సెంటర్‌ వద్ద  జిల్లా అధ్యక్షుడు మేకల దాసు, కృష్ణా కాలనీలోని సీపీఐ కార్యాలయం వద్ద  జిల్లా సహ కార్యదర్శి జోగుల మల్లయ్యలు జెండాలను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ సంస్థానం నిజాం పాలన నుంచి విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి, ముఖ్దుం మోహినోద్దిన్‌, బద్దం ఎల్లారెడ్డి, చాకలి ఐలమ్మతోపాటు ఎందరో ప్రాణ త్యాగం చేశారన్నారు.  ఈనెల 17 విముక్తి దినాన్ని అధికారికంగా నిర్వహిస్తానని చెప్పి సీఎం కేసీఆర్‌ మాటతప్పరన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో పేద, మధ్య తరగతి కు టుంబాలను మరోసారి రోడ్డున పడేయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్‌ కుట్రల ను ప్రజలు గమనిస్తున్నారని, ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో పునరాలోచించాలని కోరా రు. ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే. బాజీ సైదా, ముష్కే సమ్మ య్య, కే. నగేష్‌, సీపీఐ నాయకులు లింగం రవి, లింగమూర్తి, రాగిడి రాజు, దొడ్డిపట్ల రవిందర్‌, ప్రభాకర్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-14T10:28:16+05:30 IST