థియేటర్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ సినిమా ఎలా నడిపిస్తారో చూస్తాం: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-11-01T00:37:51+05:30 IST

కుమ్రం భీం సినిమాను రాజమౌళి విడుదల చేస్తే సినిమా రీళ్లను తగులబెడతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌...

థియేటర్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ సినిమా ఎలా నడిపిస్తారో చూస్తాం: బండి సంజయ్

హైదరాబాద్: కుమ్రం భీం సినిమాను రాజమౌళి విడుదల చేస్తే సినిమా రీళ్లను తగులబెడతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. థియేటర్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎలా నడిపిస్తారో చూస్తామని బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూమతాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకోమని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ గోండు వీరుడు కొమరం భీమ్‌ 119వ జయంతి సందర్భంగా  ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం) చిత్రంలో ఎన్టీఆర్‌ లుక్‌ను, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.


కొమరం భీమ్‌ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్‌లో సాగే ఈ టీజర్‌కు రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఈ టీజర్ చివర్లో.. కొమరం భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌ ఓ మతానికి సంబంధించిన టోపీ పెట్టుకుని కనిపించాడు. దీంతో.. ఈ సన్నివేశాన్ని తొలగించాలని, లేని పక్షంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆదివాసీ సంఘాలు, బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Read more