ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలి
ABN , First Publish Date - 2020-03-13T12:48:51+05:30 IST
ఉపాధ్యాయులు సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలువాలని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు.

ఆదిలాబాద్‌టౌన్, మార్చి12: ఉపాధ్యాయులు సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలువాలని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. గురు వారం పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గల ప్రభుత్వ మరాటీ మీడియం పాఠశాలలో ఉపాధ్యా యుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్‌రూంను ఆయన డీఈఓ రవీందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. తమ మొదటి వేతనం రూ.లక్షల 50 వేలతో పాఠశాలలో అదనపు గది నిర్మాణంతో పాటు డిజిటల్ క్లాస్‌రూం ఏర్పాటుకు ప్రొజక్టర్, ఎ ల్‌ఈడీ స్ర్కీన్‌ను సమకూర్చిన ఉపాధ్యాయులు ద త్తాత్రిముండే, దీప్సిక మానుసాడే, కేశవ్‌ఉదార్, మ ధుకర్‌కొండ, గొర్లవార్‌లను సత్కరించారు. అనంత రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడు తూ ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యతని స్తుందన్నారు.
మాతృభాష తెలుగుతో పాటు వివిధ భాషలను గౌరవిస్తూ ఆ భాషలు మాట్లాడే వారి కో సం ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటు చేస్తుందన్నా రు. ఉర్దూ, మరాఠీ మాధ్యమాల పాఠశాలల నిర్వహ ణకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. నియోజక వర్గ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు జిల్లా కేంద్రంలో జూనియర్ కళాశాలలో మరాఠీ మీడియంను ప్రా రంభించిన సంగతి గుర్తు చేశారు. విద్యార్థులు సౌ కర్యాలను సద్వినియోగం చేసుకొని చదువుల్లో రా ణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.