గిరి వికాస పథకం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టండి
ABN , First Publish Date - 2020-12-19T06:00:23+05:30 IST
జిల్లాలో గిరివికాసం పథకం అమలుకు ప్రత్యేకచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ
నిర్మల్ టౌన్, డిసెంబరు 18 : జిల్లాలో గిరివికాసం పథకం అమలుకు ప్రత్యేకచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మంది రంలో గిరి వికాసం పథకం అమలుపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలో గిరి వికాసం పథకం అమలులో భాగంగా గిరిజన రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధిం చేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాగు నీటివసతి లేని ఐదు ఎకరాలు కలిగిన గిరిజన రైతులకు ప్రభుత్వం బోరుబావులు, విద్యుత్ మోటార్లను మంజూరు చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం ద్వారా 86 మంది రైతులకు బోరుబావులు, విద్యుత్ మోటార్లు మం జూరు చేయడం జరిగిందన్నారు. గిరిజన ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించి ఎక్కువ మంది రైతులు లబ్ధి పొందేలా అధికారులు కృషి చేయా లని సూచించారు. గతంలో ఇందిరా జలప్రభ పథకం ద్వారా చేపట్టిన పను లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అద నపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి వెంకటేశ్వర్లు, విజిలెన్స్ అధికారి రోజారాణి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జైవంత్‌చౌహన్, ఎంపీ డీవోలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగాలి
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలసంఖ్య పెరగాలని జిల్లా కలెక్టర్ ముషా రఫ్ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయం త్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యశాఖ పురోగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లు, వైద్యసిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ వార్డులలో మరమ్మతులు, మరుగుదొడ్లు చేపట్టిన ఇతరాత్ర పనులను వెంటనే పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధి కారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ధన్‌రాజ్, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి, వైద్యులు కార్తీక్, రజిని, ఆశిష్ రెడ్డి, మాస్ మీడియా అధికారి రవీందర్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.