రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2020-11-28T04:41:45+05:30 IST
కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.

తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దర్శనాల మల్లేష్
తలమడుగు, నవంబరు 27: కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద ర్భంగా తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి మాట్లాడుతూ రైతుల నడ్డి విరిచే కాంట్రాక్ట్ ఒప్పందం వ్యవసాయ చట్టం, మార్కెట్ నిర్వీర్యం చేసి చట్టం, గిట్టుబాటు ధరల్ని ఎత్తేసే చట్టం, నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టం, విద్యుత్ సవరణ చట్టాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతును తన భూమిలో తనను కూలీగా మార్చే విధానం రైతుకు నస్టం అని స్పష్టం చేశారు. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని, ఫసల్ బీమా వర్తింప చేసి, ప్రతీ రైతు కుటుంబానికి రూ.7500, 10 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలన్నారు. పంట రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ రైతు సంఘం కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పిడుగు వెంకన్న, ఉపాధ్యక్షులుగా వెలుగు ఆనంద్, రంగినేని సతీష్‌రావు, ప్రధాన కార్యదర్శి కటిపెల్లి నరేందర్‌రెడ్డి, సహాయ కార్యదర్శులుగా షోవ్వా గంగారెడ్డిలతో పాటు 14 మందిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, బోజ్జ ఆశన్న, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, వికాస్, టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి పూసంసచిన్, తనుష తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని సక్నా పూర్ గ్రామానికి చెందిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.