తహసీల్దార్‌ హామీతో రైతు దీక్ష విరమణ

ABN , First Publish Date - 2020-12-29T04:14:24+05:30 IST

తాండూర్‌ మండలానికి చెందిన రైతు రాజేంద్రప్రసాద్‌ భూ సమస్య పరిష్కరించాలని రెండు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను తహసీల్దార్‌ కవిత హామీతో సోమవారం విరమిం చాడు.

తహసీల్దార్‌ హామీతో రైతు దీక్ష విరమణ
దీక్ష చేపట్టిన రైతుతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ కవిత

తాండూర్‌(బెల్లంపల్లి), డిసెంబరు 28: తాండూర్‌ మండలానికి చెందిన రైతు రాజేంద్రప్రసాద్‌ భూ సమస్య పరిష్కరించాలని రెండు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను తహసీల్దార్‌ కవిత హామీతో సోమవారం విరమిం చాడు. తహసీల్దార్‌ మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్‌ సమస్యలపై గతంలో ఆర్జీలు పెట్టుకున్నాడని, వాటికి సమాధానాలు ఇచ్చామని తెలిపారు. ధరణి వెబ్‌సైట్‌లో పార్టు బికి సంబంధించిన వివరాలు చూపించకపోవడం వల్లనే సమస్య పరిష్కారం కాలేదన్నారు. రెవెన్యూ అధికారులపై తప్పుడు ఆరోపణ లు సరికాదన్నారు. అంతకుముందు రైతు దీక్షను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాఽధ్‌ సందర్శించారు. భూమి కబ్జాచేయడానికి ఎవరైతే చూస్తున్నారో వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. భిక్షాటన చేయగా వచ్చి న రూ.630ని లయన్స్‌క్లబ్‌కు అందజేస్తానని పేర్కొన్నాడు. మహీధర్‌గౌడ్‌,  గోపతి మల్లేష్‌, రమేష్‌, శ్రీనివాస్‌, వెంకటకృష్ణ, శ్రీదేవి, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T04:14:24+05:30 IST