స్వేరో సర్కిల్ కేంద్రాలు విద్యార్థులకు వరం
ABN , First Publish Date - 2020-12-20T03:54:20+05:30 IST
స్వేరో సర్కిల్ కేంద్రాలు విద్యార్థులకు వరమని స్వేరో రాష్ట్ర కమిటీ సభ్యుడు తీగల శ్రీనివాస్ అన్నారు.

- రాష్ట్ర కమిటీ సభ్యుడు తీగల శ్రీనివాస్
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 19: స్వేరో సర్కిల్ కేంద్రాలు విద్యార్థులకు వరమని స్వేరో రాష్ట్ర కమిటీ సభ్యుడు తీగల శ్రీనివాస్ అన్నారు. శనివారం స్వేరో జ్ఞానయాత్ర కాళేశ్వరం జోన్‌లోని ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల క్షేత్రస్థాయి పర్యటన విజయవంతంగా ముగించుకొని శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నది. ఈ సందర్భంగా స్వేరో సర్కిల్, స్వేరో అనుబంధ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలుకుతూ మహనీయుల చిత్రపటాన్ని అందజేసి ఆహ్వానించారు. లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం, హాజీపూర్, మంచిర్యాల మండలాలలోని స్వేరో సర్కిల్స్‌ని సందర్శించారు. స్వేరో సర్కిల్స్ నిర్వహి స్తున్న కమండర్స్ రాజేశ్వరి, పావని, మేఘన, అమూల్యలను నాయకులు ఘనంగా సన్మానించారు. తాళ్ళపేట సర్కిల్‌లో విద్యార్థి ఆర్ట్ వేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీజీపీఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజ్మీరా సంతోష్ నాయక్, జిల్లా నాయకులు జాడి రాజన్న, స్వేరో సర్కిల్ కాళేశ్వరం జోన్ అధ్యక్షుడు బొట్ల కార్తీక్, ఉపాధ్యక్షుడు కర్రె రాజేశ్వర్, ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు కరాటే రాయమల్లు, స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా నాయకులు ఎర్రం సుధాకర్, మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు బిజ్జురి రమేష్, ప్రధాన కార్యద ర్శి దుర్గం, తులసీరాం, అధికార ప్రతినిధి గద్దల తిరుపతి, సంయుక్త కార్యదర్శి ముత్తె రమేష్, కాసిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు దాడి పెంటయ్య, నాయకులు రాజన్న, మల్లేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.