ఉరి వేసుకొని గిరిజన యువకుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-11T05:48:20+05:30 IST

ఉరివేసుకొని గిరిజన యువకుడు ఆత్మహత్య చే సుకున్నాడు.

ఉరి వేసుకొని గిరిజన యువకుడు ఆత్మహత్య

ఇచ్చోడ, డిసెంబర్‌10: ఉరివేసుకొని  గిరిజన యువకుడు ఆత్మహత్య చే సుకున్నాడు. ట్రైనీ ఐపీఎస్‌ ఆకాంక్ష యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సిరిచేల్మా ఎక్స్‌రోడ్డు కాలనీకి చెందిన రాయిసిడాం నాగోరావు కు మారుడు అన్వేష్‌(24) టీటీసీ పూర్తి చేసుకొని వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. తల్లిదండ్రులు బోథ్‌ మండలం జీడిపల్లి గ్రామంలో ఉంటూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వస్తూ పోతున్నారు. అన్వేష్‌ ఒంటరిగానే తా త, అమ్మమ్మల వద్ద ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియరాలేద ని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోథ్‌ ఆసుపత్రికి తరలించినట్లు  పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2020-12-11T05:48:20+05:30 IST