పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-12T05:09:25+05:30 IST

మండలంలోని మహాలింగి గ్రామంలో కనుగటే కిషన్‌(40 ) అనే వ్యక్తి పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది.

పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య
ఆసుపత్రిలో కిషన్‌ మృతదేహం

తానూర్‌, డిసెంబరు 11 :  మండలంలోని మహాలింగి గ్రామంలో  కనుగటే కిషన్‌(40 ) అనే వ్యక్తి పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. ఎస్సై గుడిపెల్లి రాజన్న తెలిపిన వివరాల ప్రకారం కిషన్‌ రోజువారీ కూలీ చేస్తూ జీవనం సాగిం చే వాడని, ఇటీవల తన కూతురి విడాకుల కారణంగా మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా సుపత్రికి తరలిచారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజన్న తెలిపారు.

Updated Date - 2020-12-12T05:09:25+05:30 IST