విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి

ABN , First Publish Date - 2020-12-18T04:10:54+05:30 IST

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

-ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు17: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. తెలంగాణ గురుకుల సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వ హించిన ఇగ్నైట్‌ఫెస్ట్‌ ఆకట్టుకుంది. ఈ  సంద ర్భంగా గురుకులాల ఓఎస్డీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రద ర్శనలను తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల మేథాశక్తిని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గిరిజన గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందిం చడంతో పాటు అన్ని రంగాలలో రాణించేలా ప్రభుత్వం కృషి చేస్తుం దని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైన్స్‌ ఫేర్‌, యూత్‌ పార్లమెంట్‌, ఫ్యాన్సీ డ్రెస్‌ షోలను విద్యార్థులు నిర్వహిం చడంతో వారిని అభినందించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీవో బాలస్వామి, ప్రిన్సిపాల్‌ సంతోష్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సురేష్‌, ఆయా కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T04:10:54+05:30 IST