హెల్మెట్‌ ధరించకపోతే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-12-27T05:47:47+05:30 IST

జైనథ్‌ పోలీసు సర్కిల్‌ పరిధిలోని భీంపూర్‌, బేల, జైనథ్‌ మండలాల్లోని ఆయా గ్రామాల ద్విచక్ర వాహనదారులు 2021 జనవరి 1వ తేదీ నుంచి విధిగా హెల్మెట్‌ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్‌ సీఐ కోట్నక్‌ మల్లేష్‌ హెచ్చరించారు.

హెల్మెట్‌ ధరించకపోతే కఠిన చర్యలు
టోల్‌ప్లాజా వద్ద వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న రూరల్‌ సీఐ

జైనథ్‌, డిసెంబరు 26: జైనథ్‌ పోలీసు సర్కిల్‌ పరిధిలోని భీంపూర్‌, బేల, జైనథ్‌ మండలాల్లోని ఆయా గ్రామాల ద్విచక్ర వాహనదారులు 2021 జనవరి 1వ తేదీ నుంచి విధిగా హెల్మెట్‌ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్‌ సీఐ కోట్నక్‌ మల్లేష్‌ హెచ్చరించారు. శనివారం ‘నో హెల్మెట్‌ నో పెట్రోల్‌’ కార్యక్రమంలో భాగంగా మండలంలో ని బోరజ్‌, పిప్పర్‌వాడ, పూసాయి, తదితర పెట్రోల్‌బంక్‌ల వద్ద వాహనదారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్‌ లేకపోతే వాహనానికి పెట్రోల్‌ పోయ్యక పోవడంతో పాటు వాటిని సీజ్‌ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బోరజ్‌ ఏఎంవీఐలు మహేష్‌, స్రవంతి, ఎస్సై సాయిరెడ్డి వెంకన్న, ఆర్టీవో  సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:47:47+05:30 IST