ఎస్పీఎం యాజమాన్యం తీరు సరికాదు

ABN , First Publish Date - 2020-12-27T03:57:03+05:30 IST

ఎస్పీఎం క్రీడా మైదానంలో తాము కొన్ని సంవత్సరాలుగా వాకింగ్‌ చేస్తున్నామని, ఇప్పుడు నూతన జేకే యాజమాన్యం పూర్తిగా దారులు మూసివేయడం సరికాదని వాకర్స్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ ఎం.సుభాష్‌ అన్నారు.

ఎస్పీఎం యాజమాన్యం తీరు సరికాదు
ఆందోళన చేస్తున్న వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

-వాకర్స్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ ఎం.సుభాష్‌ 

కాగజ్‌నగర్‌, డిసెంబరు26: ఎస్పీఎం క్రీడా మైదానంలో తాము  కొన్ని సంవత్సరాలుగా వాకింగ్‌ చేస్తున్నామని, ఇప్పుడు నూతన జేకే యాజమాన్యం పూర్తిగా దారులు మూసివేయడం సరికాదని వాకర్స్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ ఎం.సుభాష్‌ అన్నారు. శనివారం ఉదయం వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎస్పీఎం మిల్లు జెకె యాజమాన్యం తీరు పట్ల నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఎం.సుభాష్‌ మాట్లాడుతూ ఒకవైపు సిర్పూర్‌ పేపర్‌మిల్లు వెదజల్లుతున్న కాలుష్యం తాము భరిస్తున్నామని, తాము ఆరోగ్యంగా ఉండేందుకు కనీసం వాకింగ్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. 

సిర్పూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్‌ హరీష్‌బాబు మాట్లాడుతూ జేకే యాజమాన్యం తీరు ఏ మాత్రం బాగా లేదన్నారు. మిల్లు కాలుష్యంతో ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడా మైదానంలో వాకింగ్‌ కూడా అనుమతించక పోవడం దారుణ మన్నారు. ఈ విషయంలో జేకే యాజమాన్యం వెంటనే తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన సూచించారు. ఢిల్లీకి చెందిన అంబేద్కర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ వాలంటీనా మాట్లాడుతూ మహి ళలు వాకింగ్‌ చేసుకుందామంటే కూడా అనుమతివ్వక పోవటం దారుణ మన్నారు.  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్పీఎం యాజమాన్యం ఇష్టాను సారంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ ప్రాంత కార్మికులు తక్కువ జీతాలిస్తూ, స్థానికేతరులకు ఎక్కువ జీతాలివ్వటంపై మండిపడ్డారు. కార్మిక సంఘం నాయకడు అంబాల ఓదెలు మాట్లాడుతూ మిల్లు పునరుద్ధరణ జరిగితే ఈప్రాంత కార్మికులకు న్యాయం జరుగు తుందని అంతా ఆశించారన్నారు. కానీ నూతన యాజ మాన్యం ఏకపక్ష నిర్ణయాలతో ఈ ప్రాంత వాసులకు పూర్తిగా అన్యాయం చేస్తోం దని ఆయన విమర్శించారు.  ఈ నిరసన కార్యక్రమంలో షబ్బీర్‌ హుస్సేన్‌తో పాటు వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T03:57:03+05:30 IST