కరోనా బాధిత కార్మికులకు స్పెషల్‌ లీవ్‌ మంజూరు

ABN , First Publish Date - 2020-08-01T11:03:53+05:30 IST

సింగరేణిలో పనిచేస్తూ కరోనా పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగులకు 14 రోజుల స్పెషల్‌ లీవును మంజూరు చేస్తూ యాజమాన్యం శుక్రవారం ఉత్తర్వులను జారి

కరోనా బాధిత కార్మికులకు స్పెషల్‌ లీవ్‌ మంజూరు

శ్రీరాంపూర్‌, జూలై 31: సింగరేణిలో పనిచేస్తూ కరోనా పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగులకు 14 రోజుల స్పెషల్‌ లీవును మంజూరు చేస్తూ యాజమాన్యం శుక్రవారం ఉత్తర్వులను జారి చేసిందని టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కె సురెందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ, సింగరేణి వైద్యాధికారులు పాజిటివ్‌ వచ్చినట్లు ధ్రువీకరించిన కార్మికులు ఐసోలేషన్‌, క్వారంటైన్‌, హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి 14 రోజుల స్పెషల్‌ లీవులు వర్తిస్థాయని తెలిపారు. అదే విధంగా ప్రైమరీ కాంటాక్టుగా ఉండి క్వారంటైన్‌లో వున్న వారికి స్పెషల్‌ లీవు అమలవుతుందని పేర్కొన్నారు. యాజమాన్యం ఉత్తర్వుల సంఖ్య సీఈఆర్‌-ఐఆర్‌-878 ద్వారా సర్క్యులర్‌ జారీ చేసిందని తెలిపారు.  తమ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కర్యదర్శులు వెంకట్రా వ్‌. మిరియాల రాజిరెడ్డి యాజమాన్యంతో మాట్లాడి ఉత్తర్వులు జారీ చేయించారి పేర్కొన్నారు.


Updated Date - 2020-08-01T11:03:53+05:30 IST