పల్లెల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ABN , First Publish Date - 2020-12-05T06:34:17+05:30 IST
పల్లెల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుంటూ కృషి చేస్తుందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు.

ఎమ్మెల్యే రేఖానాయక్
ఖానాపూర్ రూరల్, డిసెంబర్ 4 ; పల్లెల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుంటూ కృషి చేస్తుందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఖానాపూర్ మండలంలోని గోసంపల్లెలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి శుక్రవారం భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 24 గంటల కరెంట్, పల్లెల్లో మౌలిక సదుపాయాలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరాఫరా, పల్లెప్రగతి వంటి కార్యక్రమాలు, పేదల కోసం వివిధ పథకాలు చేపట్టిందని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీ కేంద్రాల్లో కొత్తగా గ్రామపంచాయతీ భవనాలు నిర్మించటం జరుగుతుందని, చిన్న గ్రామ పంచాయతి ఏర్పాటుతో అభివృద్ది వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ టేకుగంగారాం, ఉపసర్పంచ్ నామెడ కృష్ణవేణి ధర్మరాజు, పీఏసీఎస్ చైర్మెన్ ఆమంద శ్రీనివాస్ నాయకులు నామెద ధర్మరాజు, చరన్, కొప్పుల శేఖర్, శోభన్, వీరేశ్, కొప్పుల రాజేశ్వర్, గాంధీ, సురేందర్, కనకవ్వ, రమేశ్, పంచాయతీ కార్యదర్శి సుమయ్య, కారోబార్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.