అటవీభూముల పరిరక్షణకు ప్రత్యేకచర్యలు

ABN , First Publish Date - 2020-12-19T05:57:50+05:30 IST

జిల్లాలో అటవీ భూముల పరిరక్షణకు ప్రత్యేకచర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీశాఖ ముఖ్యసంరక్షణ అధికారిణి ఆర్‌.శోభ అధికారులను ఆదేశించారు.

అటవీభూముల పరిరక్షణకు ప్రత్యేకచర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం

రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారిణి ఆర్‌. శోభ

నిర్మల్‌ టౌన్‌, డిసెంబరు 18 : జిల్లాలో అటవీ భూముల పరిరక్షణకు ప్రత్యేకచర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీశాఖ ముఖ్యసంరక్షణ అధికారిణి ఆర్‌.శోభ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక అటవీశాఖ కార్యా లయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీహక్కు పట్టాల కంటే ఎక్కువ భూమి సాగుచేస్తున్న అటవీభూమిని సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూభాగంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టేందుకు అటవీ, రెవెన్యూశాఖల ఉమ్మడి తనిఖీల అనంతరం అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అటవీ భూభాగంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో అటవీశాఖ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అటవీభూముల పరిరక్షణకు ప్రత్యేకచర్యలు తీసుకుంటామన్నారు. అటవీ భూముల సమగ్ర సర్వే ఇతరాత్ర అభివృద్ధి పనులను రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ సంరక్షణ అధికారి వినోద్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, అటవీ శాఖ అధికారులు విక్రమ్‌సింగ్‌, నీరజ్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ ఈఈ శంకరయ్య, ఖానాపూర్‌ అటవీ శాఖ డివిజనల్‌ అధికారి కోటేశ్వరరావు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Read more