మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎస్పీ పర్యటన

ABN , First Publish Date - 2020-03-16T12:11:05+05:30 IST

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో మళ్లీ మావోయిస్టుల క దలికలు ప్రారంభమైనట్లు పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి...

మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎస్పీ పర్యటన

పెంబి, మార్చి15: ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో మళ్లీ మావోయిస్టుల క దలికలు ప్రారంభమైనట్లు పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌ నుంచి జిల్లాలో మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో పోలీసులు అడవుల్లో కూంబింగ్‌ చేపట్టారు. ఆదివారం జిల్లా ఎస్పీ శశిధర్‌ రాజు పెంబి మండలంలోని మారుమూల గిరిజన మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో బైకుపై పర్యటించారు. గిరిజన ప్రాంత గ్రామాల ప్రజలతో కలిసి వారి మంచిచెడ్డలు విచారించారు. ప్రభుత్వం ఆదివాసీలకు అండగా ఉంటు ందని, మావోయిస్టులతో సంబంధాలను పెట్టుకోవద్దని అన్నారు. ఆదివాసీల నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నార ని, వారిని లొంగిపోయేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయన వెం ట సీఐ జయరాం, ఎస్సైలు భవానిసేన్‌ గౌడ్‌, రాజేష్‌, సిబ్బంది ఉన్నారు.


Updated Date - 2020-03-16T12:11:05+05:30 IST