రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2020-09-06T09:04:39+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రతి పల్లెకు బ స్సును నడిపి ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే జో గు రామన్న ఆర్టీసీ డీఎం జనార్థన్‌కు సూచించారు...

రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలి

ఆదిలాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 5: ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రతి పల్లెకు బ స్సును నడిపి ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే జో గు రామన్న ఆర్టీసీ డీఎం జనార్థన్‌కు సూచించారు. ఆదిలాబాద్‌ ఆర్టీసీ డీఎం గా బాధ్యతలు చేపట్టిన జనార్ధన్‌ శనివారం ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామ న్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులతో కలి సి ఎమ్మెల్యేను శాలుజతో సత్కరించారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లా డు తూ, జిల్లాలో మారుమూల ప్రాంతాలకు తెలంగాణ ప్రభుత్వంలోనే రోడ్డు సౌక ర్యం కలిగిందని, ప్రతి పల్లెకు బస్సును నడిపి ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. 


ఎమ్మెల్యేను కలిసిన అద్దె బస్సుల యజమానులు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కారణంగా గత ఐదు నెల లుగా నిలిచిపోయిన ఆర్టీసీ అద్దె బస్సులను పునరుద్ధరించేందుకు చర్యలు తీ సుకోవాలని కోరుతూ సంబంధిత యజమానులు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, త్వరలో జరుగనున్న శాసనసభ సమావేశాల్లో తమ ఇబ్బందుల ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. గత కొన్నేళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న తాము కరోనా లాక్‌డౌన్‌ కారణంగా బస్సులు నిలిచి పోవడం తో నెలవారీ అద్దెను చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. అద్దె బస్సుల యజమానుల సంఘం అధ్యక్షు డు తిరుపతిరెడ్డి, అమీర్‌ఖాన్‌, సయ్యద్‌ జమీల్‌, రవీంద్ర, అసర్‌సింగ్‌, సంజయ్‌ రెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2020-09-06T09:04:39+05:30 IST