లోకేశ్వరం తహసీల్దార్‌ కార్యాలయంలో షార్ట్‌సర్క్యూట్‌

ABN , First Publish Date - 2020-12-30T06:32:16+05:30 IST

నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి.

లోకేశ్వరం తహసీల్దార్‌ కార్యాలయంలో షార్ట్‌సర్క్యూట్‌
కార్యాలయంలో ప్రమాదం జరిగింది ఇక్కడే..

కాలిపోయిన పత్రాలు

లోకేశ్వరం, డిసెంబరు 29 : నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. వెంటనే తేరుకున్న కార్యాలయ కాపలా సిబ్బంది తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బందితో హుటాహుటిన తహసీల్దార్‌ కార్యా లయానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో గత పది సంవత్సరాలుగా దరఖాస్తు చేసు కున్న ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు కాలి పోయాయని తహసీల్దార్‌ వెంకటరమణ తెలిపారు. కార్యాలయంలో స్థలంలేక వాటిని మెట్లపై ఉంచా మన్నారు. 

Updated Date - 2020-12-30T06:32:16+05:30 IST