మహిళల భద్రత కోసమే షీటీంలు

ABN , First Publish Date - 2020-10-13T06:38:40+05:30 IST

మహిళల భద్రత కోసం షీటీంలు నిరంతరంగా పనిచేస్తాయని షీటీం ఇన్‌చార్జి, మాదారం ఎస్సై మానస అన్నారు

మహిళల భద్రత కోసమే షీటీంలు

నెన్నెల, అక్టోబరు 12: మహిళల భద్రత కోసం షీటీంలు నిరంతరంగా పనిచేస్తాయని షీటీం ఇన్‌చార్జి, మాదారం ఎస్సై మానస అన్నారు.   నెన్నెలలో  సోమవారం చైల్ట్‌లైన్‌, పోలీసు శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె  మాట్లాడారు. ప్రేమపేరిట వేధించడం,  ఈవ్‌టీజింగ్‌  చేయడం,  ఫోన్‌కాల్స్‌తో, ఫెస్‌బుక్‌, వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వార ఆడ పిల్లను  వేధిస్తే 100, 1098 నంబర్లకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.  ఈవ్‌టీజర్ల బెడద తగ్గాలంటే పోలీసులకు యువతుల సహకారం ఎంతో అవసరం ఉందన్నారు.


జిల్లా సంక్షేమాధికారి రవూఫ్‌ఖాన్‌ మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల సమాజంలో ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యాన్ని కలిగి దాన్ని సాకారం చేసుకోవడానికి కృషి చేయాలన్నారు. ఆడపిల్లను ఎదగనిద్దాం అనే ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. ఆడపిల్లల రక్షణలో తామ సైతం భాగస్వాములమవుతామని ప్రతిజ్ఞ చేశారు.  కార్యక్రమంలో నెన్నెల ఎస్సై రమాకాంత్‌, సీడీపీవో ఉమాదేవి, చైల్డ్‌లైన్‌ డైరెక్టర్‌ జీజో, బాలల సంరక్షణ అధికారి ఆనంద్‌, జిల్లా చైల్డ్‌లైన్‌ సమన్వయకర్త సత్యనారాయణ, ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, హైస్కూల్‌ హెచ్‌ఎం నారాయణ, ఏపీఎం విజయలక్ష్మి, ఎంపీటీసీ హరీశ్‌గౌడ్‌, నాయకులు తోట శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T06:38:40+05:30 IST