నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-05-17T09:43:17+05:30 IST

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటా మని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌ అన్నారు, మండల కేంద్ర మైన ముథోల్‌లో

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

డీఏవో అంజిప్రసాద్‌


ముథోల్‌, మే 16 : నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటా మని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌ అన్నారు, మండల కేంద్ర మైన ముథోల్‌లో శనివారం ముథోల్‌, బాసర మండలాలకు చెందిన విత్తనా లు, పురుగుమందులు, ఎరువుల వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో హాజరై మాట్టాడారు. ప్రతీ వ్యాపారి సంబంధిత లైసెన్స్‌ కలిగి ఉండి వాటి నకళ్లను షాప్‌లో కనపడేటట్లు అమర్చుకోవాలన్నారు. విత్తనాలు, పురుగుల మందులకు సంబందించిన పీసీలను ఎరువులకు సంబంధించిన ఓ ఫారంలను లైసెన్స్‌లో ఎంట్రీ చేసుకోవాలన్నారు.


స్టాక్‌రిజిస్టర్‌, బిల్‌బుక్‌లను రోజువారీగా నిర్వహిస్తూ వాటిపై విధిగా ఏవోతో సర్టీపై చేయించుకోవాలన్నారు. ఈ సందర్భం గా ముథోల్‌ సీఐ అజయ్‌బాబు మాట్లాడుతూ ఎటువంటి కల్తీ విత్తనాలు, నిషేధి త బీటీ3విత్తనాలు అమ్మకూడదన్నారు.  ఈ సందర్భంగా అధికారులు పలు సల హాలు, సూచనలు  ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అశోక్‌, ఎవో అజ్మీరా భాస్కర్‌, ఏఈవోలు. సీడ్‌ ఫెస్టిసైడ్‌  వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.     

Updated Date - 2020-05-17T09:43:17+05:30 IST