ముగ్గురు డీజిల్ దొంగల పట్టివేత
ABN , First Publish Date - 2020-12-30T05:46:44+05:30 IST
డీజిల్ దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు నిం దితులను మంగళవారం మండలంలోని రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నట్లు ఎస్సై భరత్‌సుమన్ తెలిపారు.

నేరడిగొండ డిసెంబరు 29: డీజిల్ దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు నిం దితులను మంగళవారం మండలంలోని రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నట్లు ఎస్సై భరత్‌సుమన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉట్నూ ర్ మండలం కుమ్మరి తండాకు చెందిన ముగ్గురు స్నేహతులు చోపడే ధన్‌రాజ్, బోకెన అవినాస్, ఆడే రాజేశ్వర్‌లు గత కొంతకాలంగా జాతీయ రహదారి పక్కనే గల సెల్ టవర్ జనరేటర్‌లలోని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఈ మేరకు కేసు నమోదు చేశామని వివరించారు.