ఆన్‌లైన్‌లో సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన
ABN , First Publish Date - 2020-11-28T04:52:30+05:30 IST
జిల్లా స్థాయిలో యేటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇన్‌స్పైర్ మనక్ అవార్డు సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన ఈ యేడాది కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు.

డీఈవో రవీందర్‌రెడ్డి
ఆదిలాబాద్‌టౌన్, నవంబరు 27: జిల్లా స్థాయిలో యేటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇన్‌స్పైర్ మనక్ అవార్డు సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన ఈ యేడాది కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. 2019-20 సంవత్సరపు ప్రదర్శనలను ఆన్‌లైన్ ద్వారా నిర్వ హించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరానికి గాను జిల్లాలోని అన్ని యాజ మాన్యాల 6 నుంచి 10 తరగతులకు చెందిన 610 మంది తమ పరిశోధనలను సమర్పించగా 16 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై ప్రతి ఒక్కరూ 16 మందికి డీఎస్‌టీ న్యూడిల్లీ వారు వారి వ్యక్తిగత ఖాతాలో రూ.10వేలు జమ చేసినట్లు తెలిపారు. వీరికి డిసెంబర్ 1 నుంచి 10 వరకు తమ ప్రాజెక్టులను ఆన్‌లైన్‌లో ఇన్‌స్పైర్ మనక్ కాంపిటేషన్‌యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. తాము తయారు చేసిన ప్రాజెక్టు ఫొటోస్, 5 నిమిషాల వీడియో 30 ఎంబీ, ఆడియో ఫొటోలను అప్‌లోడ్ చేయాలన్నారు. వీటిని డిసెంబర్ 11, 15 తేదీల్లో జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అత్యుత్తమ ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నారు. స్టేట్ లెవల్‌లో డిసెంబర్ 25 తేదీలోపు రాష్ట్ర స్థాయి కమిటీ జాతీయ స్థాయికి పంపుతుందన్నారు. ఇందుకు ఎంపికైన పాఠశాలల ప్రిన్సిపాల్‌లు, ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు వెంటనే ప్రిపేర్ చేసుకొని వాటి వీడియో, ఆడియో, ఫొటోస్, 1000 పదాలకు మించని లగు సంక్షిప్త రైటప్‌లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రఘురమణ 9440066288కు సంప్రదించాలని తెలిపారు.