బిల్లులు చెల్లించాలని సర్పంచ్‌ల నిరసన
ABN , First Publish Date - 2020-12-12T04:24:26+05:30 IST
మండల సర్వసభ్య స మావేశం శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ రోపణలు, ప్రత్యాపరోణలతో రసాభాసగా మారింది. నిర్మాణ పనుల బిల్లుల చెల్లింపులపై జరుగుతున్న ఆలస్యం వల్ల సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్య లు చేసుకునే పరిస్థితి నెల కొందని అధికార పార్టీ స ర్పంచులే ఆరోపించారు.
కాసిపేట, డిసెంబరు 11 : మండల సర్వసభ్య స మావేశం శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ రోపణలు, ప్రత్యాపరోణలతో రసాభాసగా మారింది. నిర్మాణ పనుల బిల్లుల చెల్లింపులపై జరుగుతున్న ఆలస్యం వల్ల సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్య లు చేసుకునే పరిస్థితి నెల కొందని అధికార పార్టీ స ర్పంచులే ఆరోపించారు. ఎం పీపీ రొడ్డ లక్ష్మీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభి వృద్ధి, సంక్షేమ పథకాలపై ఎలాంటి తీర్మానాలు లేకుం డా ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రగతి నివేదిక లు చదివి వినిపించారు. గ్రా మాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, డంపింగ్‌యా ర్డులు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలతో అప్పుల పాలవుతున్నామని సర్పంచులు పేర్కొనడంతో సభ లో గందరగోళం నెలకొంది. వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, సింగిల్ విండో చైర్‌పర్సన్ నీల, పెద్దనపల్లి సర్పంచు వేముల కృష్ణల మధ్య పరస్పర ఆరోపణ లతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనం తరం గ్రామాల్లో ఏర్పాటు చేసే వీధి లైట్ల కాంట్రా క్టు ఒప్పందం తీర్మానంపై సర్పంచులు వ్యతిరేకిం చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈఈఎస్‌ఎల్ (ఎనర్జీ ఎఫి షెన్స్ సర్వీసు లిమిటెడ్) సంస్థకు తీర్మానాలు ఇవ్వ మని సర్పంచులు సభలో చేతులెత్తి నిరసన తెలి పారు. సర్పంచుల ఉనికికే ప్రమాదం తెచ్చే ఈ కాం ట్రాక్టు ఒప్పందాలను తిప్పి కొడుతున్నామని పెద్దన పల్లి సర్పంచు వేముల కృష్ణ తెలిపారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో బెల్టుషాపులు పెరిగిపోయాయని ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకువెళ్లారు. అనం తరం ఎంపీపీ మాట్లాడుతూ సత్వరమే బిల్లులు చె ల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. ఎంపీటీసీలు మేరుగు పద్మ, నవనందుల చంద్రమౌళి, కో ఆప్షన్ సిరాజ్‌ఖాన్, ఎంపీడీవో ఆలీం, ఎంఈవో దామోదర్, డిప్యూటీతహసీల్దార్ లక్ష్మీరా జం, అధికారులు పాల్గొన్నారు.