ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృధ్దికి నిధులు ఇవ్వండి
ABN , First Publish Date - 2020-12-12T05:06:41+05:30 IST
నూతనంగా ఏర్పడిన ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్దికి నిధులు మంజూ రు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మంత్రి కేటిఆర్‌ను కోరారు.
మంత్రి కేటిఆర్‌కు ఎమ్మెల్యే రేఖానాయక్ వినతి
ఖానాపూర్, డిసెంబరు 11 : నూతనంగా ఏర్పడిన ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్దికి నిధులు మంజూ రు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మంత్రి కేటిఆర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రిని కలిసి ఖానాపూర్ అభివృద్దికి చేపట్టాల్సిన పనులను వివ రిస్తూ వాటికి కావాల్సిన నిధులను మంజూరి చేయా లని కోరారు. ఖానాపూర్‌లో సెంట్రల్ లైటింగ్ ఏర్పా టుకు కృషి చేయాలని ఎమ్మెల్యే రేఖానాయక్ మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకెళ్ళగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ ఆంధ్రజ్యోతికి ఫోన్‌లో వివరించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్‌తో పాటు టీఆర్ ఎస్ నాయకులు కిషోర్‌లు ఉన్నారు.