విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2020-12-31T04:23:05+05:30 IST

విద్యార్థుల భవిష్యత్తును అధ్యాపకులు తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

- మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావు

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 30: విద్యార్థుల భవిష్యత్తును అధ్యాపకులు తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు.  విద్యార్థుల భవిష్యత్తును  అధ్యాపకులు తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు. బుధవారం మంచిర్యాల ప్రభుత్వ జూనియర్‌ కాలేజిలో ఏర్పాటు చేసిన  ప్రిన్సిపాల్‌ ఎలీషా దేవి పదవీ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకుల సంఘం నాయకులు లక్ష్మణ్‌రావు, అంజయ్య, వెంకటేశ్వరరావు, కనకయ్య, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:23:05+05:30 IST