రైతన్నకు అండగా.. అందరూ కలిసిరండి

ABN , First Publish Date - 2020-11-26T05:37:19+05:30 IST

దేశంలో రైతన్నకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుని రైతన్నకు అండగా నిలిచే ందుకు ఏఐకేఎ్‌ససిసి ఆద్వర్యంలో నిర్వహించే పోరులో ప్రతీ ఒక్కరు కలిసిరావాలని ఏఐకేఎమ్మెస్‌ ఉమ్మడి జిల్లా అఽధ్యక్షులు నంది రామయ్య పిలుపునిచ్చారు.

రైతన్నకు అండగా.. అందరూ కలిసిరండి
ఇంద్రవెల్లిలో సమ్మె పోస్టర్లను విడుదల చేస్తున్న నాయకులు

నేటి గ్రామీణ రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయండి

ఏఐకేఎమ్మెస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య ఫ సత్తన్‌పెల్లిలో మహాధర్నా

ఖానాపూర్‌, నవంబరు 25: దేశంలో రైతన్నకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుని రైతన్నకు అండగా నిలిచే ందుకు ఏఐకేఎ్‌ససిసి ఆద్వర్యంలో నిర్వహించే పోరులో ప్రతీ ఒక్కరు కలిసిరావాలని ఏఐకేఎమ్మెస్‌ ఉమ్మడి జిల్లా అఽధ్యక్షులు నంది రామయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏఐకేఎ్‌ససీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఈసందర్భంగా కేంద్రం తెచ్చిన మూడు రైతు వ్యతరేక చట్టాలను రద్దు చేయాలని రైత న్న పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ప్రధాన డిమాండ్‌లతో ఏఐకేఎ్‌స సీసీ ఇచ్చిన గ్రామీణ రాష్ట్ర బంద్‌ను విజయంవంతం చేయాలని ఆయన కోరారు. గ్రామీణ రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో సత్తన్‌పెల్లి గ్రామంలో గురువారం రైతలచే మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ మహాధర్నాకు మండల నలుమూలల నుండి రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎ్‌ససిసి జిల్లా నాయకులు ఎల్‌ఆర్‌ ఉపాలి, ఎల్‌ భీమయ్య, చుంచుల నారాయణ, కే రాజేశ్వర్‌, గోరే భాయ్‌, మునోవర్‌, తదితరులున్నారు.

ఇంద్రవెల్లి: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం నిర్వహించే దేశవ్యాప్త గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు స్వరాజ్య వేధిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బోర్రన్న అన్నారు. దీనిలో భాగంగా మండల కేంద్రంలో దేశ వ్యాప్త సమ్మె పోస్టర్లను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోది ప్రభుత్వం  నియంతృత్వ విధానాలను అమలు చేయడంతో వ్యవసాయరంగలో కార్పోరేట్‌ కం పెనీలకు అనుకూలమైన నిరంకుశ చట్టాలు తీసుక వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తు రైతులు ఈ బంద్‌కు సహకారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాదవ్‌ దుదరాం, ఆత్రం భీంరావు, గాయక్‌వడ్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.

బంద్‌కు సంఘాల నాయకులు మద్దతు తెలుపాలి

ఆదిలాబాద్‌ టౌన్‌: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక విధానాలకు నిరసనగా ఈనెల 26న గురువారం జరిగే గ్రామీణ బంద్‌కి అన్ని సంఘాల నాయకులు మద్దతు తెలపాలని అఖిల పక్షం నాయకులు కోరారు. బుధవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ బంద్‌కి అన్ని సంఘాల నాయకులు మద్ధతు తెలిపి బంద్‌లో పాల్గొనాలన్నారు. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఇన్‌చార్జీ అధ్యక్షులు సాజిద్‌ఖాన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు, ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్‌, సీపీఐ(ఎంఎల్‌) జిల్లా నాయకులు వెంకట్‌ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సమ్మెకు ఎస్‌ఎఫ్‌ఐ సంపూర్ణ మద్ధతు

ఆదిలాబాద్‌ టౌన్‌: రైతు సంఘాలు చేపట్టిన సమ్మెకు, గ్రామీణ బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ ఆదిలాబా ద్‌ జిల్లా కమిటీ సంపూర్ణ మద్ధతు తెలుపుతుం దని సంఘం సభ్యులు అన్నారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మిక చట్టాలను సవరిస్తూ నాలుగు కోడ్‌లుగా తీసు కురావడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త కార్మిక సంఘాలు, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు రావడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశంలో కార్మిక వర్గానికి భద్రతగా హక్కులుగా ఉన్న 29 కార్మిక చట్టాలను యజమానులకు చుట్టాలుగా మారుస్తూ నాలుగు కోడ్‌లుగా సవరణలు చేసిందన్నారు. ఈ కార్మిక చట్టాలు ఇంతకాలం కార్మికులకు సామాజిక ఆరోగ్య ఆర్థిక భద్రతను కల్పించాయని, నేడు ఈ కార్మిక చట్టాలను యజమానులకు ఉపయోగపడేలా సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆరోపించారు. ఈ సవర ణల వల్ల దేశంలో 74శాతం కార్మిక వర్గం కార్మిక చట్టాల నుంచి మినహాయించ బడుతున్నారాన్నరు. ఇది కార్మిక వర్గానికి తీరనినష్టం చేస్తుందని, కేంద్ర ప్రభు త్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులు తన వ్యవసాయ క్షేత్రంలోనే కూలీలుగా మార్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని ఎన్నికల హామీలు గుప్పించి, నేడు వ్యవసాయా న్ని కార్పొరేట్‌ వ్యవసానికి అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ రైతు వ్యతి రేక వ్యవసాయ చట్టాలను వె ంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ,వ్యాపారీకరణ, కాషాయికరణ చేసేందుకు దోహదపడే నూతన విద్యా విధానం 2020ని వెంటనే ఉప సంహరించుకోవాలని, విద్యారంగానికి కేంద్ర బడ్జెట్‌లో 15శాతం నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు జాతి సంపద ఇది దేశ ప్రజల ఆస్థి, ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్‌ కార్పొరేట్లకు దారదత్తం చేసే బుద్దిలేని విధానాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ బంద్‌కు సహకరించి జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఇందులో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆత్రం నగేష్‌, అన్న మొల్ల కిరణ్‌, ఉపాధ్యక్షుడు తోట కపిల్‌, నాయకులు పాల్గొన్నారు.

నిర్మల్‌ కల్చరల్‌: దేశవ్యాప్తంగా ఈనెల 26న జరిగే సార్వత్రిక సమ్మెకు ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా తమ మద్దతు ప్రకటించాయి. నిర్మల్లఓ జిల్లా అధ్యక్షుడు అరవింద్‌ మాట్లాడుతూ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్పొరేట్‌కు మేలుచేసే ప్రైవేటీకరణలు వ్యతిరేకిస్తూ సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. 

Updated Date - 2020-11-26T05:37:19+05:30 IST