ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం
ABN , First Publish Date - 2020-11-22T04:53:56+05:30 IST
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
మహేశ్వరం: కరోనా కాలంలోనూ ప్రజాసంక్షేమానికి లోటు రానీయకు ండా ప్రతీ సంక్షేమ పథ కాన్నీ అమలు పరుస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం పట్టణానికి చెందిన యాదగిరికి మం జూరైన రూ.42వేల ము ఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంత్రి తన నివాసంలో అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు అవాస్తవ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీజేపీ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారన్నారు. సీఎంఆర్‌ఎఫ్ నిధులను కేవ లం వైద్య ఖర్చుల కోసమే వాడుకోవాలని లబ్ధిదారుడికి సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు హన్నగల్ల చంద్రయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దిద్దెల అశోక్‌కుమార్, రాజారాజేశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పెయ్యల నర్సిహ, టీఆర్‌ఎస్ మండ ల యువజన విభాగం అధ్యక్షుడు దయ్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు.