అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-20T06:59:14+05:30 IST
అప్పులు అధికమై.. బతుకు భారమై మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన జటంగుల శ్రీనివాస్(34) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై దివ్యభారతి తెలిపారు.

తలమడుగు, డిసెంబరు 19: అప్పులు అధికమై.. బతుకు భారమై మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన జటంగుల శ్రీనివాస్(34) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై దివ్యభారతి తెలిపారు. పూర్తి వివరాల ప్రకారం.. మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన జటంగుల శ్రీనివాస్ తనకున్న వ్యవసాయ పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం సాగు చేస్తున్నాడు. ఈయేడు పంట దిగుబడి రాకపోవడంతో, అప్పులు భారం అధికమై మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. వ్యవసాయం కోసం బ్యాంకులో, ప్రైవేటుగా అప్పుడు చేశాడని పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.