ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-20T04:23:26+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీని నిర్వీర్యం చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌ అన్నారు.

ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌

-ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌

ఆసిఫాబాద్‌, డిసెంబరు 19: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీని నిర్వీర్యం చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌ అన్నారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడి ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తుందని, ఒకే దేశం.. ఒకే పన్ను అని కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు డీజిల్‌పై నాలుగు శాతం పన్ను విధిస్తూ ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఆర్టీసీకి 31.83 శాతం పన్ను విధిస్తుందన్నారు. దీంతో ఆర్టీసీకి సంవత్సరానికి సుమారు రూ.622 కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2019 మో టారు వెహికల్‌ యాక్టు ఆర్టీసీకి నష్టం కలిగించేలా ఉందని ఆయన అన్నారు. ప్రైవేటు వ్యాపారస్తులకు లాభం చేకూ ర్చేలా ఉందన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో ఈ నెల 21న జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిం చడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T04:23:26+05:30 IST