రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-12-28T05:58:44+05:30 IST

జిల్లా కేంద్రంలో జరుగుతున్న రోడ్డు వైండింగ్‌ పనులను ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు.

రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేయాలి
కాంట్రాక్టర్లు, కరెంట్‌ అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 27: జిల్లా కేంద్రంలో జరుగుతున్న రోడ్డు వైండింగ్‌ పనులను ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఠాకూర్‌ హోటల్‌ వద్ద రోడ్డు నిర్మాణం పనుల్లో భాగంగా కరెంట్‌ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఠాకూర్‌హోటల్‌ సమీపంలో కరెంట్‌ స్తంభాలు వైర్లను తొలగించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులు, కాంట్రాక్టర్లతో సమన్వయంతో పనులు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

Read more