ఎల్లంపల్లి ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం

ABN , First Publish Date - 2020-08-12T10:09:01+05:30 IST

జిల్లాలోని గుడిపేట సమీపంలోగల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో క్రమంగా నీటిమ ట్టం పెరుగుతోంది

ఎల్లంపల్లి ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం

143.86 మీటర్లకు చేరిన నీరు

ప్రస్తుత నిలువ 10.437 టీఎంసీలు

ఇన్‌ఫ్లో 21,391 క్యూసెక్కులు

ఔట్‌ఫ్లో 16,371 క్యూసెక్కులు

గత సంవత్సరం కంటే తగ్గిన నీటి నిలువలు


మంచిర్యాల, ఆగస్టు 11: జిల్లాలోని గుడిపేట సమీపంలోగల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో క్రమంగా నీటిమ ట్టం పెరుగుతోంది. వర్షాపాతం సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ  కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయం నుంచి ఎత్తపోతల ద్వారా ప్రాజెక్టులోకి నీరు చేరుతోంది. జలాశయం సామర్థ్యం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 143.86 మీటర్ల వరకు నీరు చేరుకొంది. ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.437 టీఎం సీల నీరు చేరింది. ప్రాజెక్టులోకి 24 గంటల్లో ఇన్‌ఫ్లో 21,391 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో 16,371 క్యూసెక్కులు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని పార్వతి పంప్‌ హౌజ్‌ నుంచి 20,490 క్యూసెక్కుల నీటిని రివర్స్‌ పంపిం గ్‌ ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోస్తుండగా స్థానిక జలవనరుల నుంచి 901 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు నుంచి వివిధ పనులకుగాను పెద్ద మొత్తంలో కేటాయింపులు ఉండటంతో నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. 


ఔట్‌ ఫ్లో 16,371 క్యూసెక్కులు...

ప్రాజెక్టు నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం 16,371 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎన్టీపీసీ అవ సరాలకు 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ స్కీంకు 337 క్యూసెక్కులు విడుదల అవుతోంది. జగిత్యాల జిల్లా నందిమేడారంలోని నంది పంప్‌హౌజ్‌కు 15,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్‌ భగీరథ పథకం కోసం పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి 37 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా, మంచిర్యాల జిల్లాకు 24 క్యూసెక్కులు కేటాయిస్తున్నారు. వీటితోపాటు మరో 102 క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 


గణనీయంగా పడిపోయిన నీటి మట్టం....

గత సంవత్సరంతో పోల్చితే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. గత సంవత్స రం ఆగస్టు 11న 147.77 మీటర్ల నీరు ఉంది. ప్రాజెక్టులో నీటిమట్టం మంగళవారం 143.70 మీటర్లు మాత్రమే ఉండగా, కెపాసిటీ 10.437 టీఎంసీలు ఉంది. ఈ ప్రకా రం గత సంవత్సరం కంటే ప్రాజెక్టులో దాదాపు సగం నీటిమట్టం పడిపోయింది. ఐదు రోజులుగా పరిశీలించినట్లయితే నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటం కొంత లో కొంత ఉపకరించేలా ఉంది. ఈనెల 6న 142.46 మీటర్లతో 8.122 క్యూసెక్కుల నీరు ఉండగా 7న, 142. 55 మీటర్లతో 8.259 క్యూసెక్కులు, 8న 142.64 మీటర్లతో 8.396 క్యూసెక్కులు, 9న 143.45 మీటర్లతో 9.725 క్యూసెక్కులు, 10న 143.58 మీటర్లతో 9.951 క్యూసెక్కులు ఉండగా 11వ తేదీన 143.86 మీటర్ల సామర్థ్యంతో 10.437 క్యూసెక్కులకు చేరుకొంది. 


వర్షాభావ పరిస్థితులతో...

ఈ సంవత్సరం ఆశించినంతగా వర్షాలు పడక ప్రాజెక్టులోకి తగినంత నీరు చేరడం లేదు. సమృద్ధిగా వర్షాలు కురిస్తే కడెం ప్రాజెక్టు నిండి, దాని నుంచి ఎల్లంపల్లి జలాశయంలోకి నీరు వచ్చి చేరేది. ఈ యేడు వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టుల్లో సాధారణ స్థాయికి కూడా నీరు చేరలేదు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం సాధారణ స్థాయి కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతోంది. ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు కురిసిన వర్షా న్ని పరిశీలిస్తే జిల్లాలో సరాసరి 10.4 మిమీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే దాదాపు 2 మి.మీ తక్కువ. గత సంవత్సరం ఈ సమయంలో జిల్లా లో 12.9 మిమీ వర్షపాతం నమోదైంది. రెండు రోజుల్లో జిల్లాలో 16.8 మిమీ వర్షం కురిసింది. 

 

Updated Date - 2020-08-12T10:09:01+05:30 IST