19 నుంచి లాక్‌డౌన్‌కు తీర్మానం

ABN , First Publish Date - 2020-08-16T10:47:32+05:30 IST

బెజ్జూరు మండల కేంద్రంలో ఈ నెల 19నుంచి ఐదు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించేందుకు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తీర్మానం

19 నుంచి లాక్‌డౌన్‌కు తీర్మానం

బెజ్జూరు, ఆగస్టు 15: బెజ్జూరు మండల కేంద్రంలో ఈ నెల 19నుంచి ఐదు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించేందుకు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తీర్మానం చేశారు. బెజ్జూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో సర్పంచ్‌ అన్సార్‌ హుస్సేన్‌ వ్యాపారస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ మంగళవారం పొలాల పండగ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 19 నుంచి అన్ని వ్యాపార సముదాయాలను మూసివేసేందుకు తీర్మానించామని తెలిపారు. 

Updated Date - 2020-08-16T10:47:32+05:30 IST