డాక్టర్‌ సర్ణ్ణారెడ్డికి రీ-పోస్టింగ్‌

ABN , First Publish Date - 2020-12-31T05:19:06+05:30 IST

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నిర్మల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్‌ స్వర్ణారెడ్డి తాజాగా రీ- పోస్టింగ్‌ పొందారు.

డాక్టర్‌ సర్ణ్ణారెడ్డికి రీ-పోస్టింగ్‌
డాక్టర్‌ సర్ణ్ణారెడ్డి

గత ఎన్నికల్లో నిర్మల్‌ సెగ్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నేత

బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి జంప్‌ ఫ తాజాగా పోస్టింగ్‌

నిర్మల్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నిర్మల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్‌ స్వర్ణారెడ్డి తాజాగా రీ- పోస్టింగ్‌ పొందారు. మాజీ డిప్యూటీ స్పీకర్‌ దివంగత భీంరెడ్డి కూతురైన స్వర్ణారెడ్డి రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరి 2018లో నిర్మల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఆమె బీజేపీకి రాజీ నామా చేసి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాని కి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె తనకు తిరిగి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసు కున్నారు. ఆమె విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తిరిగి పోస్టింగ్‌ ఇచ్చింది. గతంలో ఆమె ఏ స్థాయిలో పని చేస్తూ రాజీనామా చేశారో... తిరిగి అదే స్థాయిలో రీ-పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్వర్ణారెడ్డి బుధవారం తిరిగి విధుల్లో చేరారు. దీన్ని నిర్మల్‌ జిల్లా డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ దేవేందర్‌ రెడ్డి ధృవీకరించారు.

Updated Date - 2020-12-31T05:19:06+05:30 IST