లక్ష్యాన్ని చేరుకునేనా?

ABN , First Publish Date - 2020-12-31T04:29:17+05:30 IST

మత్స్య సంపదను పెంపొందించి దానిపై ఆధార పడి జీవిస్తున్న మత్స్యకారులకు ఆర్థిక సాధికారత కల్పించాలన్న ప్రభుత్వం లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరేలా లేదు.

లక్ష్యాన్ని చేరుకునేనా?
వట్టివాగు ప్రాజెక్టు

-ఈ ఆర్థిక సంవత్సరం రిజర్వాయర్లు, చెరువుల్లో 1.30 కోట్ల చేప పిల్లలు విడుదల 

-జిల్లాలో 4వేల టన్నుల దిగుబడి లక్ష్యం

-ఇప్పటి వరకు 2వేల టన్నుల దిగుబడికే పరిమితం

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

మత్స్య సంపదను పెంపొందించి దానిపై ఆధార పడి జీవిస్తున్న మత్స్యకారులకు ఆర్థిక సాధికారత కల్పించాలన్న ప్రభుత్వం లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరేలా లేదు. ఇందుకు వాతావరణ పరిస్థి తులతో పాటు చేపల పెంపకంపై మత్స్యకార సంఘాలకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం చిన్న, పెద్ద జలాశయాలలో 1.30 కోట్ల చేప పిల్లలను జార విడిచారు. కాగా 4వేల టన్నుల చేపల దిగుబడి లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు దిగుబడి 2వేల టన్నులకు మాత్రమే చేరుకుంది. చేప పిల్లలను జారవిడవడం మొదలు కొని తిరిగి చేపలను మార్కెటింగ్‌ చేసే సమయానికి వాటి ఎదుగుదల పెద్దగా ఉండడం లేదు. రిజర్వా యర్లు, పెద్ద చెరువులను మినహాయిస్తే చిన్ననీటి కమతాలలో చేపల దిగుబడి ఆశించిన రీతిలో రావడం లేదు. గతేడాది కూడా ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. 5వేల టన్నుల చేపల దిగుబడి లక్ష్యాన్ని నిర్దేశించగా గత సంవత్సరం 4వేల టన్నులు మాత్రమే వచ్చింది. 


30మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు

జిల్లాలో మొత్తం 30మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా వీటి ద్వారా 2,500 మంది సభ్యులు నేరుగా లబ్ధి పొందుతున్నారు. అలాగే లైసెన్స్‌ పొంది చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఇతరులు మరో వెయ్యి మంది వరకు ఉన్నారు. వీరే కాకుండా జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద చెరువులలో స్థానికులు మరో వెయ్యి మంది వరకు చేపల వేటనే వృత్తిగా ఎంచుకొని ఉపాధి పొందు తున్నారు. జిల్లాలో సాగు చేస్తున్న అక్వా ఉత్ప త్తులను ఎక్కువగా మహారాష్ట్రలోని చంద్రా పూర్‌, బల్లార్షా, నాగ్‌పూర్‌ ప్రాంతాలకు ఎగుమతి చేస్తు న్నారు. ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో చేపలు పడుతున్న మత్స్యకారులు ఎక్కువగా అహేరి, గడ్చిరోలి వంటి ప్రాంతాలకు వెళ్లి చేపలు విక్రయిస్తున్నారు. వాతవారణ పరిస్థితులు అనుకూలించి చేపలు పెరిగేందుకు అవసరమైన నీటి పరిమాణం ఉన్న జల వనరులలో చేపలు అధి కంగా వృద్ధి చెందుతున్నాయి. ఇంకా కొంత మెరుగైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే చేపల సైజు గణనీయంగా పెరుగుతుందని మత్స్య శాఖ అధికా రులు చెబుతున్నారు. ఈఏడాది దిగుబడులలో వచ్చిన చేపల సగటు పరిమాణాన్ని పరిశీలిస్తే పెద్ద చెరువుల్లో అర కిలో సైజు వరకు రాగా రిజర్వా యర్లలో మాత్రం కిలో నుంచి రెండు కిలోల వరకు సైజు వచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. ఈకారణంగానే చేపల దిగుబడులలో ఆశించిన ఫలితం రాలేదంటున్నారు. అయితే జిల్లాలో సాగు చేసిన రొయ్యలు మాత్రం మత్స్య కారులకు ఆదా యాన్ని సమకూర్చి పెట్టాయి. 


2020-21 లక్ష్యం ఇదీ.. 

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మత్స్య పారిశ్రామిక విధానం కింద జిల్లా లక్ష్యాలను నిర్ణయించారు. 248 చెరువులలో 35 నుంచి 40 ఎంఎం గల చేప పిల్లలు 62.235 లక్షలు, పది పెద్ద చెరువులు, నాలుగు రిజర్వాయర్‌లలో 80 నుంచి 100 ఎంఎం పొడవు కలిగిన 71.295 లక్షల చేప పిల్లలను జారవిడిచారు. మొత్తంగా 1.30కోట్ల చేప పిల్లను జార విడుదల చేశారు. అలాగే మూడు ప్రాజెక్టులు, రెండు పెద్ద చెరువులలో మొత్తం 13 లక్షల రొయ్య పిల్లలను జారవిడిచారు. 

యాజమాన్య పద్ధతులు పాటించాలి

-సాంబశివరావు, జిల్లా మత్స్య శాఖ అధికారి 

యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి పెంచవచ్చు. అంతేకాకుండా చేప పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఎప్పటికప్పుడు మత్స్య పారిశ్రామిక సంఘాలకు సూచనలు అందిస్తున్నాం. ముఖ్యంగా మత్స్య సంఘాలు శనగపిండి, తవుడు, పేడ వంటి వాటిని చెరువుల్లో జార విడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పేడ చెరువులో ఓ మూలన వేయడం వల్ల దాని నుంచి ఉత్పన్నమయ్యే గడ్డి పరాన్నజీవుల కారణంగా చేపలకు ఆహారం లభిస్తుంది. ఈ ఏడాది ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా మేలైన చేప దిగుబడులను సాధించడంతో పాటు నిర్దేశిత లక్ష్యాన్ని కూడా చేరుకునే అవకాశం ఉంది. ఈ దిశగా చేపల ఉత్పత్తిని సాధించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. 


Updated Date - 2020-12-31T04:29:17+05:30 IST