రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-07-19T07:04:43+05:30 IST

మండలంలోని కేస్లాపూర్‌లో రైతు వేదిక భవన నిర్మాణానికి ఎంపీపీ పోతరాజుల రాజేశ్వరి లక్ష్మణ్‌ శ...

రైతు వేదిక  నిర్మాణానికి శంకుస్థాపన

భీమిని, జూలై 18 : మండలంలోని కేస్లాపూర్‌లో రైతు వేదిక భవన నిర్మాణానికి ఎంపీపీ పోతరాజుల రాజేశ్వరి లక్ష్మణ్‌ శనివారం శంకుస్ధాపన చేశారు. ప్రభుత్వం రైతుల కోసం రైతు వేదిక భవనాలను నిర్మిస్తోందని, ఇది రైతులకు ఎంతో ఉప యోగకరంగా ఉంటాయని తెలిపారు. జడ్పీటీసీ గంగక్క, సర్పంచు సురేష్‌, ఎంపీడీవో రాధాకృష్ణ, ఏవో విజ య్‌కుమార్‌, ఎంపీవో విజయ్‌ ప్రసాద్‌, ఏపీవో భాస్కర్‌రావు, ఏఈవో కార్తీక్‌, పంచాయతీ కార్యదర్శి సురేష్‌ పాల్గొన్నారు. అనంతరం గ్రామం లోని డంపింగ్‌యార్డు, శ్మశాన వాటికల నిర్మాణ పనులను ఎంపీపీ పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని కార్యద ర్శికి సూచించారు. మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామంలో హరితహారంలో మొక్కలు నాటారు. 

Updated Date - 2020-07-19T07:04:43+05:30 IST