ఎన్టీఏ జాతీయ స్థాయిలో జిల్లా విద్యార్థికి రెండో ర్యాంకు

ABN , First Publish Date - 2020-12-03T05:42:19+05:30 IST

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో యూజీసీ నెట్‌లో భాగంగా మం డలంలోని బెల్గావ్‌ గ్రామానికి చెందిన సర్వట్వర్‌ సతీష్‌ స్నేహ దంపతుల కుమారుడు శ్రేయష్‌ జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించాడు.

ఎన్టీఏ జాతీయ స్థాయిలో  జిల్లా విద్యార్థికి రెండో ర్యాంకు

జైనథ్‌, డిసెంబరు 2: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో యూజీసీ నెట్‌లో భాగంగా మం డలంలోని బెల్గావ్‌ గ్రామానికి చెందిన సర్వట్వర్‌  సతీష్‌ స్నేహ దంపతుల కుమారుడు శ్రేయష్‌ జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించాడు. బుధవారం పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలూరి గోవర్ధన్‌రెడ్డి మండలంలోని బెల్గావ్‌ గ్రామానికి వెళ్లి విద్యార్థిని పూలమాలలు, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజీఆర్‌ మాట్లాడుతూ విద్యార్థి ఆలిండియా స్థాయిలో 99.33 శాతం మార్కులు పొంది 2వ ర్యాంకు సాధించడం అభినందనీయ మన్నారు. పట్టుదల ఉంటే దేనినైనా సాధించ వచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వి.గజా నన్‌రావ్‌, సర్పంచ్‌ జంగిలి గంగన్న, నాయకులు భూమారెడ్డి, విలాష్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-12-03T05:42:19+05:30 IST