రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-08T04:00:20+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

ఏసీసీ, డిసెంబరు 7: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే బిల్లు లను ప్రవేశపెట్టిందని, కనీస మద్దతు ధరను తొలగిం చే విధంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులకు మద్దతు గా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిర్వహిస్తున్న ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున తరలిరా వాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు శ్రేయస్సుకు రుణమాఫీ, రైతుబంధు, బీమా అందిస్తూ వారి అభివృ ద్ధికి కృషి చేస్తోందన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌, సత్యం, విజిత్‌రా వు, సత్యనారాయణ, సునీతాకిషన్‌  పాల్గొన్నారు. 

మందమర్రిటౌన్‌  : వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఎం కేసీ ఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు మంగళ వారం ఇందారం వద్ద తలపెట్టిన రాస్తారోకోకు రైతులు, నాయకులు తరలిరావాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టా లను రద్దు చేయాలని చేపట్టిన బంద్‌ను విజయవం తం చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ ఓదెలు కోరారు. రైతులకు సంఘీభావంగా  ఇందారం వద్ద తలపెట్టిన రాస్తారోకో చేపట్టామన్నారు. మాజీ విప్‌ నల్లాల ఓదెలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం  రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.  

Updated Date - 2020-12-08T04:00:20+05:30 IST