నిర్మల్‌ మీదుగా ఆదిలాబాద్‌కు రైల్వేలైన్‌ మంజూరు

ABN , First Publish Date - 2020-02-12T05:58:13+05:30 IST

గత కొన్నే ళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్మూర్‌ మీదుగా ని ర్మల్‌, ఆదిలాబాద్‌కు రైల్వే లైన్‌ను నిర్మించాలని కోరుతూ

నిర్మల్‌ మీదుగా ఆదిలాబాద్‌కు రైల్వేలైన్‌ మంజూరు

ఎంపీ సోయం వినతి

నిర్మల్‌కల్చరల్‌, ఫిబ్రవరి11: గత కొన్నే ళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్మూర్‌ మీదుగా ని ర్మల్‌, ఆదిలాబాద్‌కు రైల్వే లైన్‌ను నిర్మించాలని కోరుతూ ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు మంగళవారం నాడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి వి నతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ యన 2017-18లో ఆదిలాబాద్‌ నుంచి నిర్మ ల్‌ మీదుగా ఆర్మూర్‌ వరకు 220కిలో మీటర్ల పొడవునా రూ.2800 కోట్ల అంచనా వ్యయం తో బడ్జెట్‌లో నిధులు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తో రైల్వేశాఖ జాయింట్‌ వెంచర్‌ కింద పను లు చేపట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం స హకరించడం లేదని ఎంపీకి వివరించారు. వెనకబడిన ఆదిలాబాద్‌ నుంచి ముత్కేడ్‌ మీదుగా హైదరాబాద్‌కు రైల్‌లో వెళ్లాలంటే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వ స్తుందని, తద్వారా జిల్లా ప్రజలు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని ఎంపీ సోయం బా పురావు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.


హై దరాబాద్‌కు కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటు చేస్తే జిల్లా ప్రజలకు 150కిలోమీటర్ల దూరం భార ం తగ్గే అవకాశం ఉందని వివరించారు. ఈ రైల్వేలైన్‌ను త్వరితగతిన పూర్తి చేసి దూర భారం తగ్గించాలని కోరారు. జిల్లా ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తొలగించి తక్షణం రైల్వే లైన్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. అలాగే ఆదిలాబాద్‌ నుంచి నాందేడ్‌ మీదుగా బెంగుళూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రై ల్‌ను సత్వరమే పొడగించేలా రైల్వేశాఖ అధికారులను ఆదేశించాలని కోరారు.


రైల్వేశాఖ లో ప్రతిపాదన దశలో ఉన్న ఆదిలాబాద్‌లో పిట్‌లైన్‌ మంజూరు చేయాలని, మహారాష్ట్ర కు అనుసంధానం చేస్తూ ఆదిలాబాద్‌ నుం చి కిన్వట్‌ మీదుగా నాందేడ్‌కు అదనంగా రై లు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఙప్తి చేశారు. ఆదిలాబాద్‌లో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తాంసి బస్టాండ్‌ పాయింట్‌ వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించగా రైల్వే మంత్రి సానుకూలంగా స్పం దించి చర్యలు తీసుకుంటామని హామీ ఇ చ్చారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రిని ఎం పీ సోయం బాపురావు సన్మానించారు.

Updated Date - 2020-02-12T05:58:13+05:30 IST