రైల్వేగేట్ల ఎత్తివేతపై ప్రజాభిప్రాయ సేకరణ

ABN , First Publish Date - 2020-11-20T04:39:42+05:30 IST

కాసిపేట, తాండూర్‌ రైల్వే గేట్లను గురువారం బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి పరిశీలించారు. కాసిపేట, తాండూర్‌ రైల్వే గేట్లు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఒక రైల్వే గేటును మూసివేయాలని ఆదే శాలు వచ్చాయని ఆర్డీవో తెలిపారు.

రైల్వేగేట్ల ఎత్తివేతపై ప్రజాభిప్రాయ సేకరణ
మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఆర్డీవో శ్యామలాదేవి

తాండూర్‌(బెల్లంపల్లి), నవంబరు 19 : కాసిపేట, తాండూర్‌ రైల్వే గేట్లను  గురువారం బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి పరిశీలించారు. కాసిపేట, తాండూర్‌ రైల్వే గేట్లు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఒక రైల్వే గేటును మూసివేయాలని ఆదే శాలు వచ్చాయని ఆర్డీవో తెలిపారు. ఏ రైల్వే గేటును ఎత్తివేయాలో ప్రజాప్రతి నిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. తాండూర్‌ మండల ప్రజా ప్రతినిధులు ఆర్డీవోతో మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఉన్న రైల్వే గేట్లను ఎత్తివేస్తే  ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. రైల్వే గేటు ఉన్న ప్రాంతంలో అండర్‌ బ్రిడ్జిలను ఏర్పాటు చేసేలా చూడాలని విన్నవించారు. స్పందించిన ఆర్డీవో రైల్వే అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని తెలిపారు. అనంతరం రైల్వే గేట్ల స్థానంలో అండర్‌ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌ కవితకు వినతిపత్రం అందించారు. జడ్పీటీసీ సాలిగాం బానయ్య, ఎంపీపీ ప్రణయ్‌, ఎంపీ టీసీలు సిరంగి శంకర్‌, కో ఆప్షన్‌ నజ్జిఖాన్‌, ప్రజలు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-20T04:39:42+05:30 IST