కల్లెంపల్లి ప్రాంతంలో పులి సంచారం

ABN , First Publish Date - 2020-12-04T04:09:21+05:30 IST

మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన కల్లెంపల్లి శివారులో గురువారం మధ్యాహ్నం పెద్దపులి సంచరించింది.

కల్లెంపల్లి ప్రాంతంలో పులి సంచారం
బుడుగుఒర్రె సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి కోసం గాలిస్తున్న అధికారులు

వేమనపల్లి, డిసెంబరు 3: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన కల్లెంపల్లి శివారులో గురువారం మధ్యాహ్నం పెద్దపులి సంచరించింది. గ్రామానికి చెం దిన తలండి బానయ్యకు చెందిన పత్తి చేనులో సుమారు 40 మంది కూలీలు పత్తి ఏరే పనిలో నిమగ్న మయ్యారు. నైతం యశోద అనే మహిళ పత్తి ఏరి సంచిలో నింపుతు న్న క్రమంలో అదే చేనులో నిద్రిస్తున్న పెద్దపులిని చూసి ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది. పులి ఉందని అరవడంతో అక్కడి నుంచి సమీపంలోని అడవిలోకి వెళ్లినట్లు కూలీలు చెబుతు న్నారు. దీంతో కూలీలందరు పత్తి ఏరడం నిలిపివేసి ఇళ్లకు వెళ్లిపో యారు. అలాగే కల్లెంపల్లి గ్రామానికి చెందిన కుడిమేత శివయ్య అనే గిరిజన రైతు వరిగడ్డి కోసం దహెగాం మండలం రావులపల్లికి వెళ్తుండగా అటవీ ప్రాంతంలో పులి కనిపించిందని దీంతో భయంతో ఇంటికి తిరిగి వచ్చిన ట్లు అతడు తెలిపాడు. పులి సంచారంతో భయాం దోళనకు గురైన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అటవీశాఖ బీట్‌ ఆఫీసర్లు అశోక్‌, శరత్‌, నజీర్‌ బేస్‌ క్యాంపు సిబ్బందితో కలిసి పులి అడుగులు గుర్తించేందుకు గాలించారు. పులి పాదముద్రలు తమకు లభ్యం కాలే దని అటవీశాఖ సిబ్బంది చెబుతు న్నారు. అటవీశాఖ అధికారులు కల్లెంపల్లి, సుంపుటం, జాజులపేట, ముక్కిడిగూడెం గ్రామాల ప్రజలకు ఈ మేరకు అవగాహన కల్పించారు. అడవి ప్రాంతం వైపు వెళ్లవద్దని చెప్పారు. పత్తి చేన్లకు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.

Updated Date - 2020-12-04T04:09:21+05:30 IST